కొత్త బంగారు లోకం - నిజంగా నేనేనా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీ పై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామ మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా … హరే హరే హరే హరే హరే రామ మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా … నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా <మ్యూజిక్> ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతీ క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోన అడుగులు వేస్తూ నడచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా <మ్యూజిక్> నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీ పై నన్నే తోస్తున్నారా హరే హరే హరే హరే హరే రామ మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా … హరే హరే హరే హరే హరే రామ మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా …